సిపిఎం పోరు యాత్రను జయప్రదం చేయండి-కల్లూరి మల్లేశం

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 17 (జనంసాక్షి) మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేయడం కోసం ప్రత్యామ్నాయంగా గోదావరి కృష్ణ జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26 న ఆత్మకూరు మండలానికి రాబోయే సిపిఎం పోరు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపు నిచ్చినారు ఈనెల 21 నుండి 28 వరకు మూసి ప్రాంతంలో సిపిఎం నిర్వహిస్తున్న పోరుయాత్ర ఆగస్టు 26 న ఆత్మకూరు మండాలనికి వస్తున్న సందర్భంగా కూరెళ్ళ, పల్లెర్ల గ్రామాల్లో శాఖ సమావేశాలు కరపత్రాల పంపిణీ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మూసి నీటిలో కాలుష్యం పెరిగిపోయి రైతులు పండిస్తున్న కూరగాయలు వరిధాన్యాలు మరియు చేపలు తినడంవల్ల ప్రజలు అనేక రకాలైన రోగాల పాలవుతూ క్యాన్సర్ కిడ్నీ జబ్బులకు గుండె జబ్బులకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు మూసి కాలకూఠ విషంగా మారిందని మూసినీటి కి బదులుగా బస్వాపురం ప్రాజెక్టు ద్వారా యర్రంబెల్లి మీదుగా పహిల్మాన్ పురం చెరువు ని రిజర్వాయర్ చేసి దాని ద్వారా బునాదిగాని కాలువలో గోదావరి జలాలను ఆత్మకూరు మోత్కూర్ అడ్డగూడురు మండలాలకు సాగు నీరు అందించవచ్చు అని తెలియజేశారు సాగు నీరు సాధన కోసం జరుగుతున్న ఈ పోరుయాత్రలో రాజకీయాలకు అతీతంగా రైతులు,ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం కూరెళ్ళ గ్రామ శాఖ కార్యదర్శి తుమ్మలగూడెం యాదయ్య పల్లెర్ల శాఖ కార్యదర్శి గునమోని స్వామి రాంరెడ్డి సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు