సిపిఎం పోరు యాత్రను జయప్రదం చేయండి

 

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 20 (జనంసాక్షి) మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేయడం కోసం ప్రత్యామ్నాయంగా గోదావరి కృష్ణ జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21నుండి 28 వరకు జరిగే సిపిఎం పోరు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపు నిచ్చినారు ఆత్మకూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ చౌరస్తా దగ్గర సిపిఎం పోరుయాత్ర పోస్టర్ ని స్థానిక నాయకత్వంతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఈనెల 21న భువనగిరి మండలం ఆనాజిపురం గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు పోరుయాత్ర ను ప్రారంభిస్తారని ఆగస్టు 28 న రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో యాత్ర ముగుస్తుందని ఈ యాత్ర లో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు ఈ పోరుయాత్ర ఆగస్టు 26 న ఆత్మకూరు మండలంలోని తిమ్మాపురం ఆత్మకూరు పల్లెర్ల కూరెళ్ళ రాఘవాపురం గ్రామాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు మూసి కాలకూఠ విషంగా మారిందని క్యాన్సర్ కిడ్నీ సంబంధించిన వ్యాధులు చర్మవ్యాధులు అబార్షన్ లు ఇతర రోగాలతో ప్రజలు ఆనారోగ్యాలకు గురౌతున్నారని మూసినీటి కి బదులుగా ఆత్మకూర్ మండలానికి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా యర్రంబెల్లి మీదుగా పహిల్మాన్ పురం చెరువు ని రిజర్వాయర్ చేసి బునాదిగాని కాలువ ద్వారా గోదావరి జలాలను ఆత్మకూరు మోత్కూర్ అడ్డగూడురు మండలాలకు సాగు నీరు అందించవచ్చు అని తెలియజేశారు సాగు నీరు సాధన కోసం జరుగుతున్న ఈ పోరుయాత్రలో రాజకీయాలకు అతీతంగా రైతులు ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం నాయకులు చెర్కు మల్లేశం నోముల నర్సిరెడ్డి రాచమల్ల సత్తయ్య తుమ్మల సత్తిరెడ్డి వేముల ప్రణయ్ విరస్వామి రవి తదితరులు పాల్గొన్నారు