సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి.

జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు22(జనంసాక్షి):
ఈనెల 24 మరియు 25 తేదీలలో జిల్లా కేంద్రంలో నిర్వహించే సిపిఐ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ కోరారు సోమవారం నాడు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి రాబోయే మూడు సంవత్సరాలలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు పలు తీర్మానాలను చేయడం జరుగుతుందని వివరించారు.ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుండి మహాసభల ర్యాలీ ప్రారంభమవుతుందని నాలుగు గంటల 30 నిమిషాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ రెండు రోజుల మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అతిధులుగా హాజరవుతున్నట్లు వివరించారు.25న నిర్వహించే ప్రతినిధుల సభలో గత నాలుగున్నర సంవత్సరాలలో నిర్వహించిన ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే ఆందోళనలకు ప్రణాళికలు రూపొందించి నట్లు వివరించారు ఈ ప్రతినిధుల సభకు గ్రామ మండల కార్యదర్శిలతో పాటు క్రియాశీలక నేతలు పాల్గొంటారని తెలిపారు అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకొనన్నట్లు తెలిపారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వ్యక్తులకు ప్రజాధనాన్ని కట్టబెట్టడం వల్ల ఆదానికి పది లక్షల 30000 కోట్లు సంపాదించారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు బ్లాస్టింగ్ వల్ల కే ఎల్ ఐ పనులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా 24న మధ్యాహ్నం మూడు గంటలకు నూతన సిపిఐ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు ఈ సమావేశంలో నాయకులు ఆనంద్ కేశవ గౌడ్ కొమ్ము భరత్ శివశంకర్ బాలా గౌడ్ శ్రీనివాసులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.