సిపిఐ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి: గన్నా చంద్రశేఖర్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

గరిడేపల్లి, ఆగస్టు 27 (జనం సాక్షి): కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పార్టీ అవలంభిస్తున్న విధానాల కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రజాస్వామ్య ప్రతిరక్షణకు  లౌకిక పార్టీలన్నీ కలిసి పనిచేయవల్సిన అవసరం వున్నదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ కోరారు. గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగిన సిపిఐ మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బిజెపి మతతత్వ విధానాలను అవలంభించటమే  కాక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికైన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను తారు మారు చేస్తూ అక్రమ మార్గంలో అధికారంలోకి తమ పార్టీ నాయకులను ముఖ్యమంత్రులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని ఆయన అన్నారు. సెప్టెంబర్ 4వ తారీఖు నుండి 8వ తేది వరకు రంగారెడ్డి జిల్లా శాంషాబాద్ లో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయటానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు, సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుండు వెంకటేశ్వర్లు, త్రిపురం సుధాకర్ రెడ్డి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, కడియాల అప్పయ్య, చేవ వెంకన్న, పోటు పూర్ణ చందరరావు, చేవ వెంకన్న, కుందూరు వెంకటరెడ్డి, పందిరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.