సిపిఐ రాష్ట్ర 3 వ మహాసభ లను జయప్రదం చేయండి

వాల్ పోస్టర్ విడుదల.
సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ్మ..
రామన్నపేట సెప్టెంబర్ 1 (జనంసాక్షి) రామన్నపేట మండల కేంద్రంలో సిపిఐ పార్టీ రాష్ట్ర 3 వ మహాసభల వాల్ పోస్టర్ ను సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ్మ అనంతరం వారు మాట్లాడుతూ శంషాబాద్ లో సెప్టెంబర్ 4 న జిల్లా పరిషత్ హైస్కూల్ లో సిపిఐ పార్టీ వేల మందితో ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, 3 రోజుల పాటు ప్రతినిధుల మహాసభలు ఉంటాయని, పార్టీకి జీవితాలను అంకితం చేసిన, పోరాటాలు, ఉద్యమాలతో పునీతం చేసిన కమ్యూనిస్టు యెాధులు, ప్రత్యేక ఆహ్వానితులు, వాలంటీర్లు, ఈ మహాసభలలో పాల్గొంటారని తెలియజేసారు. గడిచిన 8 ఏండ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలతో ప్రజలను మభ్య పెట్టడం తప్ప, ప్రజలకు చేసిందేమి లేదనీ, డీజిల్, పెట్రోల్ నిత్యావసర ధరలు పెంచడానికి వీరు వెనక ముందు ఆడరు గానీ, దేశంలో 28 కోట్ల పేదల గురించి ఆలోచించే పరిస్థితి వారికి లేదని, పేదలు జీఎస్టీ కట్టాలి, పెరిగిన నిత్యావసర ధరలు కొనాలి, డిజీల్ రేట్ల గురించి అడగవద్దు, కానీ  ఈ ప్రభుత్వాలు మాత్రము తమ ఇష్టానుసారం రేట్లు పెంచవచ్చునా అన్నారు, టాక్సీలు, జీఎస్టీ లు ప్రజలు కట్టాలి, లాభాలు మాత్రం కార్పోరేట్ శక్తులైన అదానీ, అంబానీ లకు కట్టబెడతారా  అని ప్రభుత్వాలను దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు, కొన్ని పనికి రాని పథకాల పేరుతో అవినీతి చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అన్నారు. సిపిఐ రాష్ట్ర మహాసభలలో భవిష్యత్తు కార్యాచరణలను రూపొందించి పోరాటాలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాల్ పోస్టర్ విడుదల చేసిన వారిలో మండల సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్, గీత పనివారల మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య , రైతు సంఘం  మండల కార్యదర్శి కూనూరు లక్ష్మీ నరసింహ, సిపిఐ సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, భగవంత, వీరమళ్ళ ముత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రచ్చ యాదగిరి, సిపిఐ పట్టణ కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, ఏనూతుల రమేష్,పల్లే మల్లేష్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.