సిపియస్ రద్దు చేసి,పాత పెన్షన్ అమలు చేయాలని గద్వాల ఎమ్మెల్యేకు వినతిపత్రం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 23 (జనం సాక్షి);
టి ఎస్ సి పి ఎస్ ఇ యు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సి పి ఎస్ రద్దు – పాత పెన్షన్ పునరుద్దరణకై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మంగళవారం వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు నాగరాజు, రాష్ట్ర సహా అధ్యక్షులు విష్ణు అధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ -రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు,రాష్ట్ర మంత్రివర్గానికి సిపిఎస్ రద్దు కోరుతూ, వివిధ రాష్ట్రాల్లో పాత పెన్షన్ అమలు చేసిన విధానమును వివరిస్తూ, వాటికి సంబంధించిన జీవోలను ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగిందనీ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సి పి ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ,ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన నిలిచారనీ, ఇక మిగిలింది సర్వీస్ పెన్షన్ మాత్రమేనాని సర్వీస్ పెన్షన్ మంజూరీ చేసి మన రాష్ట్రంలో 1 లక్ష 78 వేల ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కోసం సిపిఎస్ ని రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయగలరని,
రాజస్థాన్,ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా సి పి ఎస్ విధానం రద్దు చేసి 1980 పెన్షన్ రూల్ ప్రకారం పాత పెన్షన్ విధానము సత్వరమే అమలు పరచడానికి రాజకీయ నిర్ణయం తీసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులకు వృద్దాప్యంలో సామాజిక భద్రత కల్పించాలని,
ప్రభుత్వం సి పి ఎస్ ఉద్యోగులకు ప్రతి నెల చెల్లించే 80 కోట్లు మిగలడంతో ఈ డబ్బులను ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వాడుకోవచ్చు అని వారు తెలిపారు