సిరియాపై దాడులకు ఇది ప్రతీకారం: ఐఎస్
పారిస్,నవంబర్14(జనంసాక్షి): ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు మారణ¬మం సృష్టించాక దాడికి పాల్పడ్డది తామేనని ఇస్లామిక్ తీవ్రవాదులు ప్రకటించారు. ‘సిరియాలోని ఇస్లామిక్‌స్టేట్ స్థావరాలపై ఫ్రాన్స్ దాడులకు ఫలితమే ఇది’ అంటూ కాల్పుల అనంతరం ఉగ్రవాదులు పెద్దగా అరుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అక్కడి ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఉగ్ర దాడిలో ఇప్పటి వరకు 170 మంది మృతి చెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న పోరాటానికి ఫ్రాన్స్ మద్దతు కూడా ఉంది. రష్యా కూడా సొంతగా వారిపై దాడులకు దిగింది. ఉగ్రవాదులు పారిపోగా ఇప్పుడు ప్రాన్స్‌లో అంతా గాలింపు ముమ్మరం చేశారు.