సిరియాలో బాంబుపేలుడు, రక్షణశాఖ మంత్రి మృతి
సిరియా:డమాస్కన్: సిరియా రాజధాని డమాస్కన్‌లో జరిగిన ఓ బాంబు పేలుడులో రక్షణ మంత్రి జనరల్ దావుద్ రజా మృతి చెందారు. డమాస్కన్‌లోని రక్షణశాఖ కార్యాలయంలో అయన క్యాబినేట్ స్థాయి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. దీంతో మంత్రి మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధానిలో గత నాలుగురోజులుగా సైన్యానికి, తిరుగుబాలుదారులకు మధ్య పోరు కొనసాగుతోంది. దీనిపై సమీక్షించేందుకు మంత్రి ఈ సమావేశం ఏర్పాటుచేశారు. క్షతగాత్రులను సమీపంలోని అల్ షమి ఆసుపత్రికి చేర్చి చికిత్సచేస్తున్నారు. ఇదిలాఉండగా తమ ప్రజాస్వామ్య దళాలు ఆసుపత్రిని కూడా చేట్టుముట్టాయని తిరుగుబాటుదారులు ప్రకటించారు.