సిరిసిల్ల బంద్‌కు తెరాస పిలుపు
కరీంనగర్: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ ఎల్లుండి సిరిసిల్ల బంద్‌కు తెరాస పిలుపునిచ్చింది. విజయమ్మ పర్యటనకు నిరసనగా తెలంగాణ జిల్లాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.