సిరిసిల్ల సిట్టింగ్.. వేములవాడ షిఫ్టింగ్..

బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.సిరిసిల్ల సిట్టింగ్ అభ్యర్థి మంత్రి కేటీఆర్.వేములవాడ “చల్మెడ” కు షిఫ్టింగ్”జనంసాక్షి”విశ్లేషణాత్మక కథనంరాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21. (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానమైన రెండు నియోజకవర్గాలు సిరిసిల్ల వేములవాడ. ప్రస్తుతం సిరిసిల్ల వేములవాడ రెండు నియోజకవర్గాలు బిఆర్ఎస్ ఖాతాలోని ఉన్నాయి. కొంత భాగం ఇల్లంతకుంట మానకొండూర్ వైపు, బోయిన్ పల్లి చొప్పదండి నియోజకవర్గాల వైపు వెళ్లిన కూడా ప్రస్తుతానికైతే బిఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. సోమవారం సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రస్తుతం వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. సిరిసిల్ల నియోజవర్గ ప్రజలతో మమేకమైన కేటీఆర్ మళ్లీ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలో దిగినున్నట్లు తేలిపోయింది.వేములవాడ నియోజకవర్గం లోనే బిఆర్ఎస్ క్యాడర్లో కొంత గందరగోల పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చేన్నమనేని రమేష్ బాబు పేరు జాబితాలో లేకపోవడంతో రమేష్ బాబు అనుచరులు ల్లో నిరాశ చోటుచేసుకుందని చెప్పుకోవచ్చు. చేన్నమనేని కుటుంబానికి కంచుకోటగా భావించిన వేములవాడ నియోజకవర్గం లో చేన్నమనేని రాజేశ్వరరావు తర్వాత రమేష్ బాబు వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అనుహ్యంగా చేన్నమని రమేష్ బాబు పేరు జాబితాలో లేకపోవడం వేములవాడ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రెండు శిబిరాలుగా విడిపోయిన బిఆర్ఎస్ శ్రేణులు ఒక్కటై చల్మెడ వైపు ఈ మేరకు నిలబడతాయి అన్నది వేచి చూడవలసి ఉన్నది.సిరిసిల్ల నియోజకవర్గం లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతో పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కబెట్టుకొని కేటీఆర్ గెలుపు కోసం ముందస్తు వ్యూహరచనతోనూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఎటోచ్చి వేములవాడ నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముందు నుంచి చల్మెడ వైపు కేటీఆర్ సానుకూలంగా ఉన్నారని ఆ పరిస్థితిలోనే ఆయన పేరు ఖరారు అయిందని వేములవాడ నియోజకవర్గంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో బిఆర్ఎస్ క్యాడర్ అంతా ఒకే తాటిపైకి వస్తే తప్ప చల్మెడ గెలుపు సునాయాసం కాకపోవచ్చు. మరోవైపు చేన్నమనేని కుటుంబం నుంచి విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ వికాస్ రావు బిజెపి నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. చల్మెడ చేన్నమనేని కొట్లాటను తెలివిగా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఉపయోగించుకుని లబ్ధి పొందేందుకు ఎదురుచూస్తున్నారా అన్నది వేములవాడ నుంచి వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.