సివిల్స్ టాఫర్ కు PMO నుంచి పిలుపు

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు వచ్చింది. సోమవారం (ఏప్రిల్-30) పేరెంట్స్ తో కలిసి అనుదీప్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధాన మంత్రి ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో…  ప్రధాని తరపున కేంద్ర మంత్రి చేతుల మీదుగా అనుదీప్‌ను.. అతడి తల్లిదండ్రులను PMO కార్యాలయంలో మంగళవారం(మే-1) సన్మానించనున్నారు.