సివిల్ అధికారుల పేరుతో డ్రామాలు
గతంలో అధికారులను వేధించన ఘనత జగన్‌దే
తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు
వైకాపాలో పరాకాష్టకు మద్యం అక్రమాలు: జివి
గుంటూరు,ఆగస్ట్17 (జనం సాక్షి): సివిల్ సర్వీస్ అధికారుల పేరిట వైకాపా, జగన్ డ్రామాలు ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అణచివేసిందే జగన్ అని మండిపడ్డారు. నాటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో ఏం చేశారో గుర్తులేదా? అని ప్రశ్నించారు. వైకాపా హయాంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ ఐదేళ్లు పోస్టింగ్ కోసం పోరాడారని గుర్తుచేశారు. సివిల్స్ అధికారుల సర్వీస్ రిజిస్టర్లు జగన్ వద్దే పెట్టుకుని వేధించారని ఆరోపించారు. ఎంపీని లాకప్‌లో హింసించిన అధికారులపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. వైకాపా హయాంలో చేసిన తప్పులపై వారే సిగ్గుతో తల దించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం తమ ప్రభుత్వ నిర్ణయమని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఇదిలావుంటే మద్యం అక్రమాలకు జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని తెదేపా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. కల్తీ, నాసిరకం మద్యంతో 30 వేల మందికిపైగా ప్రాణాలు తీశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం మద్యం
విధానాన్ని సంస్కరించాలని చూస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల మద్యాన్ని నగదు రూపంలో అమ్మారన్నారు. డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజల గొంతులో విషం పోశారని మండిపడ్డారు. జగన్, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్‌రెడ్డి పాపాలు అన్నీఇన్నీ కావని పేర్కొన్నారు. దిల్లీ, ఛత్తీస్‌గఢ్ కుంభకోణాలు చిన్నబోయేలా వైకాపా హయాంలో మద్యం అక్రమాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికలలో వైసీపీ కాళ్లు, కీళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టినా జగన్‌లో ఇంకా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ రాక్షస మద్యం విధానం సంస్కరించాలని చూస్తుంటే తప్పుడు ప్రచారామా అంటూ విరుచుకుపడ్డారు. జగన్ కల్తీ, నాసిరకం మద్యంతో 30 వేల మందికి పైగా ప్రజల ప్రాణాలు తీశారన్నారు. అయిదేళ్లలో రూ.1.24లక్షల కోట్ల మద్యాన్ని జగన్ నగదు రూపంలోనే అమ్మారన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజల గొంతుల్లో విషం పోశారని మండిపడ్డారు.జగన్, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్‌రెడ్డి పాపాలు అన్నీఇన్నీ కావన్నారు. ఢల్లీి, ఛత్తీస్‌గడ్ కుంభకోణాలు చిన్నబోయేలా వైసీపీ హయంలో మద్యం అక్రమాలు జరిగాయన్నారు. మద్యం విధానంలో మార్పులతో కూసాలు కదులుతాయానే జే`గ్యాంగ్‌లో కలకలం చెలరేగుతోందన్నారు. చిప్పకూడు తినడం అర్థమై కావాలని కూటమి ప్రభుత్వంపై సాక్షిలో తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.