సిసి కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చు జగదేవ్ పూర్ ఎస్ఐ కృష్ణమూర్తి

జగదేవ్ పూర్ , అక్టోబర్ 14 (జనంసాక్షి):
నేరాలను చేధించడం లో సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని జగదేవ్ పూర్ ఎస్ఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు.
శుక్రవారం జగదేవ్ పూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను స్థానిక సర్పంచ్ లింగాల భిక్షపతి, గ్రామస్థుల తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలను, దోపిడీలను అరికట్టవచ్చన్నారు. సిసి కెమెరాల వల్ల గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు జరగవని తెలిపారు. ఒక సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వాటితో 24గంటల పాటు నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
వ్యక్తి గత భద్రత కోసం ప్రతి ఒక్కరూ ప్రవేటికరణ వ్యవస్థ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాలను నియంత్రించడం ప్రతి ఒక్కరు బాద్యతగా తీసుకోవాలన్నారు. కాగా
సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్న గ్రామస్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భిక్షపతి గ్రామస్థులు కలిసి ఎస్ఐ నిశాలువాతో  సన్మానించారు. ఈ కార్యక్రమంలో  టిఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జహంగీర్, పలుగడ్డ ముదిరాజ్ అధ్యక్షుడు ఎల్లేష్,వట్టిపల్లి ముదిరాజ్ అధ్యక్షుడు బాలరాజు, ఎస్ఎంసి చైర్మన్ సాయిలు,కనకయ్య, రఘుపతి, నర్సింలు,లచ్చయ్య, ఈదయ్య, రాములు, కనకయ్య  గ్రామస్థులు పాల్గొన్నారు.
Attachments area