*సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ*
మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): మండల పరిధిలోని గణపవరం గ్రామంలో నల్గొండ పార్లమెంటు సభ్యుల కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు గురువారం స్థానిక ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నల్లగొండ పార్లమెంట్ సభ్యుల నిధుల నుండి మండలంలో అన్ని గ్రామాల మౌలిక వసతులు కల్పించడం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య, స్థానిక సర్పంచ్ కొండపల్లి విజయమ్మ నరసింహారావు, కొక్కిరేణి సింగిల్విండో చైర్మన్ చందా చంద్రయ్య, మాజీ ఎంపిటిసి సభ్యులు మట్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జయపాల్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు చందా రాధాకృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు కాలే సామెల్, జానకి రెడ్డి, లింగారెడ్డి, మాజీ సర్పంచ్ నెమ్మది శ్రీను, పలువురు వార్డ్ నెంబర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.