సీఎంఆర్ ఎఫ్ సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన రేఖ కాంతారావు

సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలి.

నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 13( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ మండలం గణపతి నగర్ కు చెందిన ధారావత్ నాగేష్ రూ.23,500, నవభారత్ ఏరియాకి చెందిన వి. నవీన్ కు 51 వేల రూపాయల చెక్కులను అందజేశారు. నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు, ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందన్నారు, ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు రైతుబంధు, దళిత బంధువు అంటే అనేక సంక్షేమ పథకాలతో దేశంలోని నవ శకానికి నాంది పలికిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు, నిరుపేద కుటుంబాల వైద్య ఖర్చులు నిమిత్తం అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నగదు మంజూరు చేసి భరోసా కల్పిస్తున్నామన్నారు, ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తోంది అన్నారు. పినపాక నియోజకవర్గం లో వేలాదిమంది పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు టిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు