సీఎం ఆశయం సాధన కోసం పాటుపడదాం’
ఖమ్మం: బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తోన్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయ సాధనకోసం పాటుపడదామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందు కోసం అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆయన ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అభివృద్ధిపరంగా పదేళ్లపాటు పూర్తిగా వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, నీళ్లు, వనరులు పుష్కలంగా ఉన్నా సమైక్యవాదుల వివక్ష పాలన కారణంగా జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్ సర్కార్ జిల్లా సమగ్రాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తుందని తెలిపారు.