సీఎం కేసీఆర్ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం
కరీంనగర్: నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు (Dalitha bandhu) పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. కరీంనగర్‌లోని ఇండోర్ స్టేడియం వద్ద మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పథకంతో దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు.