సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం.
రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 18. (జనం సాక్షి). గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను గిరిజన బందు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం వీర్నపల్లి జెడ్పిటిసి కళావతి సురేష్ నాయక్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులు ఆదివాసుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్ష వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు గూగులోత్ సురేష్ నాయక్, లకవత్ శర్మ నాయక్, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.