సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ సభను విజయవంతం చేయండి*
మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గోపాల్ పేట్ పట్టణ మండల పార్టీ నేతలతో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజుల కోదండ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరగబోయే భారీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విచ్చేస్తున్నారు కావున గోపాల్ పేట్ మండలం నుండి ఎంపీపీ, జడ్పిటిసి అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ప్రజలను, రైతులను పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు హాజరయ్యే విధంగా గ్రామాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలన్నారు ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డాకుల తిరుపతి యాదవ్ తెరాస మండల సీనియర్ నాయకులు మంద కోటేశ్వర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు మతిన్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వడ్డేమాన్ రవి, తెరాస సీనియర్ నాయకులు డ్యారపోగు నాగరాజు, లాలు నాయక్, సూర్య నాయక్, పులేందర్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు