*సీఎం కేసీఆర్ హామీలు హర్షణీయం*
లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడవత్ రవి చంద్
మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): గిరిజన రిజర్వేషన్ 10 శాతంను వారం రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడవత్ రవి చంద్ మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 10 శాతం రిజర్వేషన్ అమలు అయితే గిరిజనులకు ఎంతో మేలు చేకూరుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు మూడవత్ రవి చంద్ తెలిపారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో సేవాలాల్ బంజారా భవన్ ను 43 కోట్లతో ప్రభుత్వం నిర్మించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో గిరిజన బందు త్వరలో ప్రకటిస్తాం అన్నారు. ముఖ్యమంత్రి గిరిజన జాతిపై వరాల జల్లు కురిపించడం అభినందనీయమన్నారు.
ReplyForward
|