సీఎం పదవి నుంచి తొలగించాలనడం అవివేకం

` కేజ్రీవాల్‌కు వ్యతిరేక పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య
న్యూఢల్లీి(జనంసాక్షి): కేజీవ్రాల్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢల్లీి లిక్కర్‌ స్కాం కేసులో సీఎం కేజీవ్రాల్‌ని ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇటీవలే బెయిల్‌పై బయటకి వచ్చారు. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని పేర్కొంటూ కాంతి భాటీ అనే వ్యక్తి ఏప్రిల్‌లో ఢల్లీి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ విచారణకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీం తలుపు తట్టారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేజీవ్రాల్‌ని సీఎం పదవి నుంచి తొలగించాలని అడిగే చట్టపరమైన హక్కు పిటిషనర్‌కి లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో కేజీవ్రాల్‌కి భారీ ఊరట లభించిన్లటైంది.