సీఎం రక్షకుడు కాదు.. భక్షకుడు: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న అరెస్టుల పర్వంపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా. శ్రవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాజ్యాంగ రక్షకుడు కాదు.. భక్షకుడు అని నిప్పులు చెరిగారు. ఎన్ని కుయుక్తులు పన్నినా చలో అసెంబ్లీని ఆపలేరని తేల్చిచెప్పారు. తెలంగాణవాదులను సీఎం రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలని , చలో అసెంబ్లీని అడ్డుకోవాలని చూస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.