సీఎం రిలీప్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు 

భీమ్ గల్, ఏప్రిల్ 30, (జనంసాక్షి) : భీమ్ గల్ పట్టణానికి చెందిన ధనుంజయ్ పంతులుకు సోమవారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీప్ ఫండ్ 75 వేయిల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ధనుంజయ్ పంతులు మాట్లాడుతూ నే‌ను కార్పోరేట్ హస్పిటల్ లో వైద్యం చేసుకున్న, ఇ విషయన్ని బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డికి తెల్పడంతో ఆయన స్పందించి సీయం రిలీప్ ఫండ్ 75 వేయిల రూపాయల సహయ నిధి మంజూరు చేశారన్నారు. మాలాంటి పేదలకు సీయం రిలీప్ ఫండ్ ఒక వరం అన్నారు. సీఎం సహయ నిధితో ఆదుకున్న ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెల్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గుణవీర్ రెడ్డి, భీమ్ గల్ సోసైటి ఛైర్మన్ చౌట్ పల్లి రవి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాదవత్ శర్మనాయక్, వైస్ ఎంపీపీ శివసారి నర్సయ్య, భీమ్ గల్ సర్పంచ్ గుగులోత్ రవినాయక్, ఉపసర్పంచ్ మల్లెల లక్ష్మన్, ఎంపీటీసీ బొదిరె గంగారాం, పతాని లింబాద్రి, రాజేశ్వర్, గోపు బాలయ్య, గున్నాల భగత్ లు పాల్గొన్నారు.