సీఐటీయూ అద్వర్యం లో చలో హైదరాబాద్ ధర్నా కు బయల్దేరిన అచ్చంపేట హమాలి కార్మికులు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్ల నెరవేర్చాలి.

 

అచ్చంపేట ఆర్సి .ఆగస్టు3 (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు పట్టణంలోని హమాలీ కార్మికులు బయలుదేరారు .ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎస్ మల్లేష్ మాట్లాడుతూ.. హమాలీ కార్మికుల బాగోగుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి కేవలం నాలుగు లేబర్ కోడ్ లు గా తెచ్చింది. ఈ లేబర్ కోడ్ విధానాల వల్ల యాజమాన్యాలకు లాభాలు పెంచడానికి ఉపయోగపడతాయే తప్ప కార్మికులకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని కావున వెంటనే వీటిని రద్దు చేయాలని కోరారు. నేటికీ హమాలీ కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని గతంలో ఉన్న ఎనిమిది గంటల పని దినాలను మోడీ ప్రభుత్వం 12 గంటలకు పెంచడం వలన కార్మికులకు ఉన్న హక్కులను కాలరాయడమే అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఇదివరకే కనీస వేతనాల సవరణ చట్టం ఐదు ప్రభుత్వ ఉత్తర్వుల గెజిట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాల పై అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు పాదయాత్రలు కార్మిక కార్యాలయం ముట్టడి చేశామని అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరేత్తినట్లు తమ వైఖరిని మార్చుకోలేకపోయాయని అందుకే పెద్ద ఎత్తున ఇందిరాపార్క్ దగ్గర జరిగే ధర్నాని జయప్రదం చేయాలని హమాలి కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కూరగాయల మార్కెట్ హమాలి యూనియన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ రాజు పర్వతాలు దశరథం రవి, అమ్రాబాద్ మండల హమాలీలు మల్లయ్య తిరుపతయ్య పర్వతాలు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.