సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యాయి: వరంగల్ కలెక్టర్
వరంగల్: జిల్లాలో గతంతో పోలీస్తే సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యాయని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలియజేశారు. అయితే సాధారణ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావని, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు 135 మలేరియా, 53 డెంగీ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి సాంబశివరావు వెల్లడించారు. మలేరియా, డెంగీ జ్వరాలతో ఎవరూ చనిపోలేదని ఆయన స్పష్టం చేశారు. ఏజెన్సీలో 53 సమస్యాత్యక గ్రామాలను గుర్తించి పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. డెంగీ వల్ల జిల్లాలో మరణాలు సంభవించలేదని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పాడు.