*సీజనల్ వ్యాధులతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి- బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్*
రాజేంద్రనగర్ ఆర్.సి. (జనం సాక్షి) సీజనల్ వ్యాధులతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ వార్డులోని పలు కాలనీలలో రసాయనాలను పిచికారి చేసిన కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గడ్డి, చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు ఉంటే తొలగించాలన్నారు. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు, ఈగలు చేరి డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. ఇండ్ల మధ్యలో ఎక్కడ నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాలనీలో పర్యటిస్తూ అంటూ వ్యాధుల గురించి ప్రజలకు తెలుపుతూ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాపయ్య యాదవ్, వార్డు ప్రత్యేక అధికారి ఇమ్రాన్, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : 7వ వార్డులో రసాయనాలను పిచికారి చేస్తున్న కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్.