సీజనల్ వ్యాధుల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ పరిధిలో ఉన్న చెల్లాపూర్ లో గురువారం రోజున జిల్లా మంత్రి తాన్నీరు హరీష్ రావు ,మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రోజున చెల్లాపూర్ లో వార్డు కౌన్సిలర్ శ్రీమతి శ్రీ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి మాట్లాడుతూ చెల్లాపూర్ ప్రజలు గత కొన్ని రోజులు నుంచి ఎడతెరిపి కురుస్తున్న వర్షాల కు ప్రజలు సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి అన్నారు.ప్రజలు రోజు గోరు వెచ్చని నీరు మాత్రమే తాగాలి.ఎ పూట వంట ఆ పూట నే వండుకొని తినాలి అలాగే మన ఇంట్లో పాత పాత్రలలో నీరు నిల్వలు ఉండకుండా చూడాలి అన్నారు.మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా లేనిచో దోమలు ఈగలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాటితో సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది.తినుబండారాలకు దూరంగా ఉండాలి ఈగలు వాలిన వాటిని అసలే తినకూడదు అన్నారు. వార్డు లో ఏదైనా సమస్యలు ఉంటే మా ఫోన్ 9848813194 నెంబర్ కు కాల్ చేయాలి అన్నారు.