సీడీ, గోడపత్రికను విడుదల చేసిన జిల్లా ఎస్పీ
వికారాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఉగ్రవాద నిర్మూలన సీడీ, గోడపత్రికలను ఎన్‌టీఆర్ చౌరస్తాలో సామవారం విడుదల చేశారు. ఈ సీడీలో ఉగ్రవాద చర్యలకు ప్రజలు ఏ విధంగా అప్రమత్తమవ్వాలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఆమె కరపత్రాలను పంచుతూ ప్రధాన వీధుల్లో
కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ పోలీసులు, డీఎస్పీ, వివిధ పీఎన్ ఎస్సై లు తదితరులు పాల్గొన్నారు.