సీనియర్ జర్నలిస్ట్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్ జనంసాక్షి : పాత్రికేయ విలువలకు పట్టంగడుతూ.. తన రాతలు, విశ్లేషణల్లో ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చిన సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకుడు శ్రీ CHMV కృష్ణారావు గారు అనారోగ్యంతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) తీవ్ర సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజాప్రయోజనాల కోణంలో కృష్ణారావు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1975లో కృష్ణారావు స్టింగర్‌గా తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పలు పత్రికల్లో పనిచేశారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో న్యూస్ బ్యూరో చీఫ్‌గా 18 ఏండ్లపాటు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనను అంతా బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు.