సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా…లంచం కేసులో మేజిస్ట్రేట్ అరెస్ట్

న్యూఢిల్లీ: ఓ షాపు యజమాని నుంచి 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఢిల్లీ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్పీ భాటియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ముందస్తు సమాచారం మేరకు మంగళవారం సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఆర్పీ భాటియాను పట్టుకున్నారు.CBI-Central-Bureau-of-Investigation-coal-block

ఇటీవల లజపత్ నగర్లో తనిఖీల సందర్భంగా ఆర్పీ భాటియా.. షాపు యజమానికి చలానా వేసి కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈ చలానాను రద్దు చేయాలంటే 60 వేల రూపాయలు లంచం ఇవ్వాలని అనంతరం డిమాండ్ చేశారు. చివరకు 25 వేల రూపాయలు లంచం తీసుకునేందుకు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ మాటువేసి మేజిస్ట్రేట్ను అదుపులోకి తీసుకుంది.