సీబీఐ వలలో ఐసీఎస్
చండీగఢ్: హర్యానలో ఎస్పీగా పనిచేస్తున్న దేశ్రాజ్ తన కింది అధికారి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటుండగా సీబీఐ వలపన్ని పట్టుకుంది. ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న అశోక్‌సింగ్ అనే అధికారి ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అతనిపై విచారణ నిలిపివేపేందుకు 25లక్షలు ఎస్పీ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ముందస్తుగా రూ.లక్ష చెల్లించాలని కోరాడు. దీంతో ఎన్‌హెచ్‌ఓ సీబీఐకి సమాచారమందించి ఎస్సీని పట్టించాడు. ఎస్పీపై సీబీఐ అధికారులు కేసు నమోదుచేసి అరస్ట్ చేశారు.