సీసీఎస్‌ డీసీపీకి ఎంఐఎ ఎమ్మెల్యేల ఫిర్యాదు

హైదరాబాద్‌: ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సీసీఎస్‌ డీసీపీకి ఫిర్యాదు  చేశారు. మతానికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన పదాలతో దూషించారని వారు డీసీపీకి వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షంచాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన డీసీపీ జాన్‌ విక్టర్‌ దోషులపై చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.