సీసీ కెమెరాల ఏర్పాట్లపై అవగాహన కార్యక్రమం

ఖానాపురం జూలై 6జనం సాక్షి

 మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గించేందుకు గాను సిసి కెమెరాల ఏర్పాటుపై బుధరావు పేట గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నర్సంపేట ఏసిపి సంపత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ఒక నేరాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలంటే సిసి కెమెరాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని, అలాగే ఎవరైనా నేరం చేయాలని అనుకునేవారు సీసీ కెమెరాల నిఘా చూసి నేరం చేయకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సూర్య ప్రసాద్, ఎస్ఐ తిరుపతి, బుధరావుపేట గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు  వెంకట రమణయ్య, మౌలానా,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.