సీసీ రోడ్ల నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా  పనిచేస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ  మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మక్తల్ మున్సిపాలిటిలో  కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో  కలిసి పలు అభివృద్ధి  కార్యక్రమాలకు శంఖుస్థాపనలు,  ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహిన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. మక్తల్ మున్సిపాలిటీ  కేంద్రంలో  సుమారు 5 కోట్ల అంచనా వ్యయంతో 2.77 కి.మీ. సిసి రోడ్లు, 2.84 కి.మీ మురుగు కాల్వల నిర్మాణ పనులకు శకుస్థాపన చేశారు. 2014 తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
 ఈ కార్యక్రమం లో పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వార్డ్ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.