సీ ఏం కాన్వయ్ లో టాక్సీ ప్లేట్ వాహనాలు మాత్రమే వాడాలి
కరీంనగర్ టౌన్ ఆగస్టు 19(జనం సాక్షి):
కరీంనగర్ జిల్లా ఆల్ ప్రైవేటు కారు డ్రైవర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం రవి ప్రకటనలో ఈనెల 21న ముఖ్యమంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా కాన్వాయ్ లో కొన్ని ట్రావెల్స్ యజమానులు నిబంధనలు విరుద్ధంగా వైట్ ప్లేట్ వాహనాలు ప్రభుత్వానికి అద్దెకు పంపిస్తున్నారని తెలిపారు . వైట్ ప్లేట్ వాహనాలు ప్రభుత్వానికి అద్దెకు పంపి టాక్సీ ప్లేట్ వాహనాలు పంపించినట్టుగా ట్రావెల్స్ యజమానులు తప్పుడు బిల్లులు తీసుకుంటున్నారని ఆరోపించారు. కొందరు ప్రభుత్వ అధికారులు బంధువుల పేరు మీద డ్రైవర్ల పేరు మీద వాహనాలు అద్దెకు తిప్పుతున్నారని తెలిపారు. అట్టి వాహనాలపై జిల్లా కలెక్టర్ గారు విచారణ జరపాలని ,టాక్సీ ప్లేట్ వాహనాలు మాత్రమే కాన్వాయ్ లో వాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుప్రభుత్వం దళిత బంధు మంజూరులో మొత్తం టాక్సీ ప్లేట్లు వాహనాలే మంజూరు చేసిందని గుర్తు చేశారు వైట్ ప్లేట్ వాహనాలు ప్రభుత్వానికి అద్దెకు తిప్పడం వల్ల టాక్సీ ప్లేట్ వాహనాల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,*