సుడాన్‌లో విమాన ప్రమాదం
– 40 మంది మృతి
హైదరాబాద్ నవంబర్4(జనంసాక్షి):
దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. విమానంలో సిబ్బంది, ప్రయాణీకులు కలిపి40 మంది ఉండగా వీరిలో ముగ్గురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. మిగిలినవారంతా విమానం కూలిన స్థలంఓ ఉన్న వారిగా అధికారులు భావిస్తున్నారు.