‘సునంద పుష్కర్’ తో రామ్ గోపాల్ వర్మ?

 

A Film On Sunanda Pushkar By Ram Gopal Varma

హైదరాబాద్ : సంచలనం సృష్ఠించిన నిజ జీవిత కథలను ఎంచుకుని వాటిని సినిమాలుగా మార్చడంలో వర్మది అందెవేసిన చేయి. ముంబయి దాడుల ఉదంతంతో అటాక్స్ ఆఫ్ 26/11 తెరకెక్కించిన విషయం తెలిసిందే. అనేక విమర్శల మధ్య విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. బెజవాడ నేపథ్యంతో తెరకెక్కించిన బెజవాడ రౌడీలు సినిమా అనేక విమర్శల తర్వాత ‘బెజవాడ’గా పేరుమార్చి విడుదల చేశారు. నిజ జీవిత నేపథ్యంతో రక్త చరిత్ర, రక్త చరిత్ర2, బెజవాడ రౌడీలు,అటాక్స్ ఆఫ్26/11 రూపొందించాడు వర్మ. ఇప్పుడు అదే కోవలో ఓ నిజ జీవిత నేపథ్యంలో ఓ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ మృతి ఆదారంగా సినిమా తీసేపనిలో ఉన్నట్లు తెలుస్తుంది.మొదట ఆత్మ హత్య అనుకున్నా ఆమెది హత్య అనే తేలింది. కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద గత ఏడాది అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసుపై వర్మ కూడా స్టడీ చేస్తున్నట్లు సమాచారం. సునంద కేసు ఓ కొలిక్కి రాగానే సినిమా ప్రారంభిస్తారని వినికిడి.