సుపరిపాలనతో అభివృద్ధి: లింగ్దో

4

 

4A
కేజీ టూ పీజీతో సమానత్వం

– వి.హన్మంతరావు

నల్లగొండ,మే 2 (జనంసాక్షి):

గుడ్‌ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి లింగ్డో అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడినపుడే గుడ్‌ గవర్నెన్స్‌ సాధ్యమని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ప్రతినిధుల శిక్షణా తరగతులకు ఆయనకు హాజరై ప్రసంగించారు. సీనియర్‌ ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వారికి మార్గదర్శకులుగా ఉండాలని అన్నారు. అమెరికాలో ప్రజా ప్రతినిధులకు ఎక్స్‌పర్ట్స్‌ సహాయం చేస్తుంటారని, అందుకే వాళ్లు సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ కూడా బహుముఖంగా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. అన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటే రాణిస్తారని సూచించారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందరికి అందిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమేనని ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్‌ హన్మంతరావు  అన్నారు. ఇది అసమానతలను తొలగిస్తుందని అన్నారు. దీనిని చేపట్టడం మంచిదన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం అడుగడుగునా దోపిడికి గురైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం చాలా అద్బుతమైన కార్యక్రమమని తెలిపారు. రాజీవ్‌గాంధీ హయాంలోనే ప్రణాళికా సంఘం స్థానంలో నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతంతోనే గ్రామాలు బాగు పడతాయని వెల్లడించారు. నేటి సమాజంలో ఐటీ ప్రధాన పాత్ర పోషిస్తోందని అందుకు అనుగుణంగా మనం ముందుకు వెళ్లాలని సూచించారు.