సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా ఠాకూర్ ప్రమాణం
న్యూఢిల్లీ,డిసెంబర్3(జనంసాక్షి):సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్ టీఎస్ ఠాకూర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జస్టిస్ ఠాకూర్‌తో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు హెచ్‌ఎల్ దత్తు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్ ఠాకూర్ ఇప్పటికే నియమితులయ్యారు. జస్టిస్ దత్తు బుధవారం పదవీవిరమణచేశారు. తదుపరి సీనియర్ అయిన ఠాకూర్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు