సుప్రీం నూతన చీఫ్‌జస్టిస్‌గా ఠాకూర్‌

2

న్యూఢిల్లీ,నవంబర్‌4(జనంసాక్షి):

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జ్టసిస్‌ దత్తు డిసెంబర్‌లో పదవీవిరమణ చేయనున్నారు. అనంతరం ఆయన స్థానంలో ఠాకూర్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. న్యాయవాది స్థాయి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన జస్టిస్‌ ఠాకూర్‌ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కానున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దత్తు డిసెంబర్‌ 2న పదవీవిరమణ చేయనున్నారు. ఠాకూర్‌ పేరును హెచ్‌ఎల్‌ దత్తు ప్రతిపాదించారు. జస్టిస్‌ ఠాకూర్‌ 13 నెలల పాటు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా కొనసాగనున్నారు.  1952, జనవరి 4న జన్మించిన ఠాకూర్‌  1972, అక్టోబర్‌లో ప్లీడరుగా నమోదు చేసుకున్నారు.  1990లో సీనియర్‌ అడ్వకేట్‌గా పదోన్నతి పొందారు.  1994, ఫిబ్రవరి 16న జమ్ముకశ్మీర్‌ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  1994 మార్చిలో జడ్జిగా కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యి, 1995లో పర్మినెంట్‌ జడ్జిగా నియమితులయ్యారు.  2004, జూలైలో దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.  2008 మార్చిలో దిల్లీ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జ్టసిస్‌గా పదోన్నతి పొందారు.  2008 ఆగస్టులో పంజాబ్‌, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  2009 నవంబర్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.