సుప్రీమ్ కోర్ట్ మెట్లు ఎక్కిన ఎన్డీటీవీ

ndtv-ban-how-much-should-sufficeదేశ భద్రతకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలను ప్రసారం చేసిందని కేంద్ర ప్రభుత్వం ఎన్డీటీవీ చానల్ ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు చానల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో చానల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్డీటీవీలో ప్రసారమైన పటాన్‌కోట్‌ ఘటనకు సంబంధించిన వార్తలు ఇతర చానల్స్‌లో, పత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయని ఆయన కోర్టుకు వివరించారు.అలాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎన్డీటీవీనే ప్రసారాలను మాత్రమే నిలిపివేయడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలను పరిశీలించి, నిషేధాన్ని ఎత్తివేయాలని న్యాయవాది కోరారు. ఇదిలా ఉంటే, ప్రసారాల నిలిపివేతను దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, ఎడిటర్లు ఖండించారు.