సుశీల్‌కుమార్‌కు ప్రధాని అభినందనలు
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 66కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో రజతం సాధించిన భారత రెజ్లర్ సుశీల్‌కుమార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అభినందనలు తెలిపారు. రెజ్లింగ్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన సుశీల్‌కుమార్ జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ప్రధాని ఒక ప్రకటనలో కొనియాడారు.