సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్ ర్యాలీ ప్రారంభం
సూర్యాపేట : ఎమ్మార్సీఎస్ దళిత ఆత్మగౌరవ ర్యాలీ నల్గొండ జిల్లా సూర్యాపేటలో ప్రారంభమైంది. తెరాస అధినేత కేసీఆర్కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ పాల్గోన్నారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానం నుంచి కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. మరోవైపు నేడు సూర్యా పేటలో తెరాస సమరభేరీ జరగనుండటంతో పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



