సూర్యాపేటలో కాల్పులు: ఇద్దరు పోలీసులు మృతి

tgkzrfqcనల్లగొండ: నల్లగొండ జిల్లాలో దోపిడీ దొంగల ముఠా చెలరేగిపోయింది. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో ఏకంగా పోలీసులపైనే కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్, హోంగార్డు మృతి చెందగా సీఐ, ఆయన గన్ మెన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. సూర్యాపేట బస్టాండ్ లో వెహికిల్స్ ను చెక్ చేస్తుండగా దుండగులు ఎటాక్ చేశారు. అటు ఘటన తర్వాత పారిపోతూ దుండగులు కారులో వస్తున్న దంపతులపై దాడిచేశారు. ఈ దాడిలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వరుస సంఘటనలతో అప్రమత్తమైన పోలీసులు.. జిల్లా అంతటా అలర్ట్ ప్రకటించారు. పరారైన దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది యూపీకి చెందిన తన్వీర్ గ్యాంగ్ సభ్యులుగా గుర్తించారు.