సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశాల్లో సత్తాచాటిన బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధులుఅభినందించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి,ప్రిన్సిపాల్ ఐనాల సైదులు

తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ బెల్లంపల్లి కి చెందిన నలుగురు విద్యార్ధులు పలు సెంట్రల్ యూనివర్సిటీల్లో సీట్లు సాధించి తమ సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకోసం జాతీయ స్థాయిలో జరిగిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సియుఈటి) లో ప్రతిభ చూపి అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశాలకు అర్హత సాధించడం పట్ల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ఆనందం వ్యక్తంచేశారు.
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని అండర్ గ్రాడ్యుయేట్ కోసం జాతీయ స్థాయిలో ఆగస్టులో జరిగిన సియుఈటి లో రత్నం కళ్యాణ్ కు షోబిత్ యునివర్సిటీ, ఉత్తర్ ప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లోను, తాళ్ళపల్లి సాయి తరుణ్ కు బాబాసాహెబ్ అంబేద్కర్ సెంట్రల్ యునివర్సిటీ లక్నో లో బిఎ ఎకనమిక్స్ లోను, బండెల అభిషేక్ కు డిల్లీ యునివర్సిటీలో బి ఎస్సి కంప్యూటర్ సైన్స్ లోను, కుమ్మరి మనోజ్ కు హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ లో ఎం.ఎ సొషియాలజి మరియు హెల్త్ సైకాలజీ ఇంటిగ్రెటెడ్ డిగ్రీలో సీట్లు లభించాయి.
సత్ఫలితాలిస్తున్న హైయ్యర్ ఎడ్యుకేషన్ సెల్:

బెల్లంపల్లి సిఓఈలో ఏర్పాటుచేసిన హైయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ (హెచ్ ఈ సి) మంచిఫలితాలిస్తుందని కో ఆర్డినేటర్ అవునూరి రవి అన్నారు. ఉన్నత విద్యావకాశాలపై విద్యార్ధులకు సరైన అవగాహన కల్పిస్తూ ఆదిశగా వారిని ప్రోత్సహించడంకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకుపోతున్నామన్నారు.
జాతీయ స్థాయిలో జరిగిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి పలు సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్ధులకు ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ప్రాంతీయాధికారి (ఆరీఓ) కొప్పుల స్వరూపరాణి, ఏఆర్సీఓ కోటిచింతల మహేశ్వర రావు లు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు కళాశాలలో సీటు సాధించిన మఓజ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమంలో హెచ్ఈసి కోఆర్డినేటర్ అవునూరి రవి, వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, అధ్యాపకులు నాగిని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్ , చందా లక్ష్మీనారాయణ, గాజుల రాజేందర్, కట్ల రవీందర్, అర్జున్, రఫీ, ఆకినేపల్లి రాజేష్ , విజయ్ పాల్గొన్నారు