సెక్యులర్ తెలంగాణ
` నూతన సచివాలయంలో గుడి, మసీదు, చర్చి..
` 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):సచివాలయంలో నూతనంగా నిర్మిస్తున్న గుడి, మసీదు, చర్చి పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ మూడిరటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.గుడి, మసీదు, చర్చిని అద్భుతంగా నిర్మించామని తెలిపారు. 2,300 గజాల స్థలంలో గుడి నిర్మాణం జరిగిందన్నారు. సర్వమత సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా ఈ ప్రార్థన మందిరాలు నిర్మితం అయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న దానికంటే అద్భుతంగా వీటిని నిర్మించామన్నారు. శివాలయం, పోచమ్మ, హనుమాన్, గణపతి ఆలయాలు ఉన్నాయి వాటి పనులు అన్ని పూర్తయ్యాయని పేర్కొన్నారు. దేవాలయానికి సంబంధించి విగ్రహాలను తిరుపతి నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నాం. యాగంతో ఈ ఆలయాలు ప్రారంభమవుతాయి. మసీదు, చర్చి కూడా ఆయా మత పెద్దల సమక్షంలో ప్రారంభించుకుంటామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.