సెక్యూరిటీ సూపర్వైజర్స్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ.
సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 18:(జనం సాక్షి): జిల్లా లో
ఆర్థికంగా వెనుకబడిన మహిళల నుండి సెక్యూరిటీ సూపర్ వైజర్స్ శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎం.సుగుణ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
సెక్యూరిటీ సూపర్వైజర్స్ శిక్షణ
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇట్టి శిక్షణకు ఉమ్మడి జిల్లా పరిధిలోని (సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్) గ్రామీణ ప్రాంతాల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
18 నుండి 35 సంవత్సరాల లోపు మహిళలు అర్హులని తెలిపారు.
శిక్షణ 3 నెలలు ఉంటుందని, అభ్యర్థులు ఇంటర్ పాస్ అయి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందన్నారు.శిక్షణ అనంతరం ఖచ్చితంగా ఉద్యోగం కల్పించబడుతుందని పేర్కొన్నారు.
ఆసక్తి అర్హత గల అభ్యర్థినులు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5:00 గంటల లోపు సంగారెడ్డి లోని బైపాస్ రోడ్డులో గల జిల్లా మేనేజర్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
[email protected] మెయిల్ కు దరఖాస్తు పంపవచ్చని తెలిపారు.
దరఖాస్తుతో పాటు అభ్యర్థి ఎస్.ఎస్.సి. ఇంటర్ మెమో, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ, తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులు, ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేసి సమర్పించాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 9490242789/9014009791/
9703039541 ఫోన్ నెంబర్స్ లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఇట్టి అవకాశాన్ని అర్హులైన ఉమ్మడి జిల్లా గ్రామీణ ప్రాంత మహిళలు వినియోగించుకోవాలని ఆమె కోరారు.