సెగ్రిగేషన్ షెడ్లు,దాహానవాటికల పై అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్ళలి, వనపర్తి జడ్పీ చైర్మన్ అర్. లోక్ నాథ్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)

పెబ్బేర్ మండల పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ అర్. లోక్ నాథ్ రెడ్డి హాజరై అంశాల వారిగా సమీక్షిoచిన జిల్లా పరిషత్ ఛైర్మెన్
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఊళ్ళల్లో సెగ్రిగేషన్ షెడ్లు,దాహానవాటికలు, ట్రాక్టర్లు ఇంటింటి చేత సేకరణ వీటి అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్ళలని,
ప్రతి గ్రామంలో సర్పంచ్ కథానాయకుడు కావాలని, భారతదేశంలో సంపద నూటికి 70 శాతం వ్యవసాయం నుండి వస్తుందని, నేలలు అత్యంత బలంగా, సారవంతంగ కేవలం భారతదేశంలోనే ఉంటాయని, దేశ జనాభా రోజురోజుకు పెరుగుతుంది కావున మన వనరులను ఎప్పటికప్పుడు పెంచుకోవాలని మరియు ప్రభుత్వ పథకాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకోపోవాలని సూచించారు. మరియు భారతదేదానికి సంపద వ్యవసాయం నుండి వస్తుందని, నేలలు అత్యంత బలంగా, సారవంతంగ కేవలం భారతదేశంలోనే ఉంటాయని మరియు రైతు వేదికల్లో రైతులను అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని మరియు సర్పంచులు, ఎంపిటిసిలు టూర్ ల ద్వారా వేరే రాష్ట్రలకు వెళ్లి అక్కడి యాంత్రీకరణ పద్దతులు తెలుసుకోవాలని మరియు పనులలో అలసత్వం వహించవద్దని, వచ్చే రోజులలో ప్రభుత్వాలు స్వేచ్ఛనిస్తాయని పంచాయతీ కార్యదర్శులకు, అధికారులకు తెలియజేశారు.
కార్యక్రమంలో పెబ్బేర్ మండల ఎంపిపి, జెడ్పిటిసి, ఎంపిడిఓ, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపిటిసి లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.