సెట్‌ కాన్ఫిరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌

సంగారెడ్డి, నవంబర్‌ 12 (:  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుండి డివిజనల్‌, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన సెట్‌ కాన్ఫిరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 10న ప్రారంభమైన శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ డిసెంబర్‌ 20 వరకు కొనసాగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ప్రత్యేక అధికారులు గ్రామాలలో పర్యటించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుకు సూచించారు. పారిశుద్ధ్యం, వీధి దీపల నిర్వహణలో సక్రమంగా ఉండేలా చూడాలని మండల పరిషత్తు అభివృద్ధి అధికారులను సూచించారు. పంట నష్టపరిహారం వెంటనే పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా ప్రణాళిక విభాగానికి అవసరమైన సమచారాన్ని వెంటనే అందించాలని కలెక్టర్‌ సూచించారు. సెట్‌ కాన్ఫిరెన్స్‌లో అదనపు జాయింట్‌ కలెక్టర్‌, ఇంచార్జీ జాయింట్‌ కలెక్టర్‌ బి.ఎన్‌.వి.వి.ఎన్‌.మూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఐ.ప్రకాష్‌కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.