-సెప్టెంబర్ 1 నుండి జరగనున్న ఎల్ఐసి ఏజెంట్ల ధర్నాను విజయవంతం చేయండి.

-పాలసీ దారులకు ఇస్తున్న బోనస్ ను పెంచాలి.
-వచ్చే నెల 5 న,30 న ఏజెంట్ల కు రెస్ట్ డే.
-13 లక్షల మంది ఏజెంట్లం ఒక్కటై మన హక్కుల కోసం పోరాడుదాం.
-సెప్టెంబర్ 5న ఎల్ఐసి లో హౌస్ ఫుల్ కలెక్షన్ నిల్ చేపట్టాలి.
-ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వెంకట్ రెడ్డి, సుదర్శన్,శ్రీనయ్య.
-జిల్లా కేంద్రంలో ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్(ఎల్ ఐఏఎఫ్ఐ) సమావేశం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు30(జనంసాక్షి):
ఎల్ఐసి ఏజెంట్ల హక్కుల సాధనకై వచ్చేనెల 1 తేదీ నుండి ఎల్ఐసి కార్యాలయాల ముందు చేపట్టనున్న ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి సుదర్శన్ శ్రీనయ్య లు ఎల్ఐసి ఏజెంట్ల కు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్ జె ఆర్ ఫంక్షన్ హాలులో ఎల్ఐసి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అధికారి, ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు సుఖజీవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ (ఎల్ ఐఏఎఫ్ఐ)సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, కోశాధికారి శ్రీనయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 లక్షల మంది ఏజెంట్లం ఒక్కటై ఏజెంట్ల హక్కుల కోసం పోరాడుతామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి ఐఆర్డీఏకు ఎల్ఐసి సంస్థకు ఏజెంట్ల కమిషన్ లే కనబడుతుంది కానీ ఏజెంట్ల కష్టాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసి పాలసీలకు జీఎస్టీ విధించ డానికి ఈ సందర్భంగా వ్యతిరేకించారు. ఎల్ఐసి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒకలాగా ఏజెంట్లను మరోలాగా చూడడం ఏంటని ప్రశ్నించారు.ఎల్ఐసి ఉద్యోగులకు 85 సంవత్సరాల వరకు గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఏజెంట్లకు మాత్రం 65 సంవత్సరాలకే గ్రూప్ ఇన్సూరెన్స్ అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.రకరకాల కమిటీల పేరుతో ఎల్ఐసి ఏజెంట్లపై ఆర్థిక దాడులు జరుగు తున్నాయని అన్నారు. సమస్యల సాధనకై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.కస్టమర్లే దేవుళ్ళుగా భావించే ఎల్ఐసి సంస్థ మరి ఎల్ఐసి పాలసీదారులకు ఇచ్చే బోనస్ ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఏజెంట్లకు ఇచ్చే లోన్లకు వడ్డీ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఎల్ఐసి ఏజెంట్లకు కమిషన్లు పెంచాలని అన్నారు. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ప్రతి ఏజెంట్ కు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు.ఏజెంట్లకు ప్రావిడెంట్ ఫండ్ ( పీఎఫ్) సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.3 లక్షలు ఉన్న గ్రాడ్యుటి 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏజెంట్ల పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వాలని అన్నారు.అకాల మరణం పొందిన ఏజెంట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. సెప్టెంబర్ 1 నుండి హక్కులు సాధించేవరకు వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న ట్లు తెలిపారు.ఎల్ఐసి సంస్థ నిర్వహించే బీమా వారోత్సవాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.సంస్థ నిర్వహించే కాంపిటీషన్ లలో ఏజెంట్లు ఎవరు పాల్గొన రాదని సూచించారు.సెప్టెంబర్ 5 మరియు 30న ఏజెంట్లకు రెస్ట్ డే గా ప్రకటించారు.ఏజెంట్ల హక్కుల సాధనకై ప్రశాంత వాతావరణంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ (ఎల్ ఐఏఎఫ్ఐ)డివిజన్ అధ్యక్షుడు పి.సుఖజీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వెంకటస్వామి, కోశాధికారి బాదం శ్రీనివాసులు,ఏజెంట్లు వీరాచారి, బాదం శ్రీనివాసులు,దొంతు శంకర్, పాపులు బాలయ్య వెంకటయ్య గౌడ్ సురేందర్ గౌడ్ రాంప్రసాద్ రవీందర్ సందు యాదగిరి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.